ఛార్జ్‌జోన్‌తో ఎంజి మోటార్‌ భాగస్వామ్యం

Nov 23,2023 21:18 #Business

న్యూఢిల్లీ : బ్రిటిష్‌ ఆటోమొబైల్‌ బ్రాండ్‌ ఎంజి మోటార్‌ ఇండియా విద్యుత్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌లో ఒక్కటైన చార్జి జోన్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మాసాల్లో జాతీయ రహదారులు, నగరాలు, ఎంజి డీలర్‌షిప్‌లతో సహా కీలక స్థానాల్లో సంయుక్త ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎంజి మోటార్‌ ఇండియా తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రిఫరెన్షియల్‌ ఆఫర్‌ను రూపొందించడానికి రెండు సంస్థలు కలిసి పని చేస్తాయని తెలిపింది. వినియోగదారులకు ఛార్జింగ్‌ సేవలను సులభంగా గుర్తించడానికి, యాక్సెస్‌ చేయడానికి, చెల్లింపుల కోసం ఏకీకృత వేదికను ఏర్పాటు చేయనున్నాయి.

➡️