- వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిసెంబర్ 17,18 తేదీల్లో నెల్లిమర్లలో ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు జరగనున్నాయి అని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు సి హెచ్ వెంకటేష్, పి.రామ్మోహన లు తెలిపారు. గురువారం స్థానిక ఎల్ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభలు గోడ పత్రికను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎస్ ఎఫ్ ఐ జిల్లాలో విద్యా రంగం అభివద్ది కోసం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. 200మంది ప్రతినిధులు సభలకు హాజరు కానున్నారని,జిల్లాలో గత మహాసభల నుంచి ఇప్పటి వరకు విద్యా రంగంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కోసం,విద్యార్దులు కు ఎదురయ్యే సమస్యలపై బాధ్యత కలిగిన విద్యార్ది సంగంగా.చేసిన కషిని,జిల్లాలో పేదలకు అందించాల్సిన ప్రభుత్వ అందడంలో వస్తున్న సవాళ్ళను అధిగమించేందుకు తీసుకోవాల్సిన కర్త్యవ్యల పై చర్చించి నిర్ణయాలు చేయడం జరుగుతుందన్నారు.జిల్లాలో సరిపడా కాలేజీలు లేవు,ఉన్న కాలేజీల్లో అనేక సమస్యలు,అధ్యాపకులు లేరు, జె ఎన్ టి యు యూనివర్సిటీ గా మారినప్పటికీ అందుకు సరిపడా నిధులు లేవు సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రభుత్వం కేటాయించాల్సిన విద్యా రంగానికి కేటాయించక పోవడం వంటి సమస్యలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు.మేధావులు,విద్యా వేతలు జిల్లా ప్రజలు అన్ని విధాలా సహకరించి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో నాయకులు రాము,రవి,హర్ష,వెంకీ నాయకులు పాల్గొన్నారు.