12 మీటర్ల దూరంలో ..

Nov 23,2023 08:57 #Accidents, #Tunnel

తుది దశకు ‘ఉత్తరకాశీ’ టన్నెల్‌ ఘటన సహాయక కార్యక్రమాలు
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌ కూలిపోయిన ప్రమాదం నుంచి కార్మికులను వెలికితీతకు జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తది దశకు చేరుకున్నాయి. కేవలం మరోక 12 మీటర్లు డ్రిల్లింగ్‌ చేస్తే కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకుని రావచ్చునని బుధవారం సాయంత్రం ఆధికారులు వెల్లడించారు. అన్ని అనుకూలిస్తే బుధవారం రాత్రికే కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ‘కార్మికు లు 57 మీటర్ల దూరంలో భూగర్భంలో చికుకున్నారని భావిస్తున్నాం. ఇందులో ఇందులో ఇప్పటి వరకూ 45 మీటర్లు డ్రిల్లింగ్‌ పూర్తి చేశాం. కాబట్టి మరో 12 మీటర్ల దూరం మాత్రమే మిగిలిఉంది’ అని ఉత్తరాఖండ్‌ రోడ్డు రవాణ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో ఈ నెల 12న నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన సంగతి తెలి సిందే. ఈ సొరంగంలో 41 మంది కార్మికులు వరసగా 11 రోజుల పాటు చిక్కుకుని ఉన్నారు.

➡️