మోడీ, అమిత్షా, అదానీపై రాహుల్ తీవ్ర విమర్శలు
భరత్పూర్ (రాజస్థాన్): ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ముగ్గురిని జేబు దొంగలతో పోల్చారు. జేబు దొంగల ముఠా లాగానే ఈ ముగ్గురు కలిసి దేశంలోని ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.రాజస్థాన్లోని భరత్పూర్లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘జేబుదొంగ ఎప్పుడూ ఒంటరిగా రాడు. ముఠాలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒకరు ముందు నుంచి, మరొకరు వెనుక నుంచి వస్తారు. ఇంకొకరు దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. వీరిలో మీ దృష్టినిని మరల్చడమే మోడీ పని. హిందూ-ముస్లిం, నోట్ల రద్దు, జిఎస్టి వంటి అంశాలతో ప్రజల దృష్టి మరుస్తారు. ఇంతలో అదానీ వెనుక నుంచి వచ్చి డబ్బును దోచుకుంటాడు. ఇక పర్యవేక్షించడం అమిత్షా పని. అక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకుండా చూసుకుంటాడు’ అని విమర్శించారు.