డిసెంబరు 26 నాటికి క్లయిమ్‌లు పూర్తి

Nov 22,2023 22:08
వచ్చే నెల 26వ తేదీ నాటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన అన్ని క్లయిమ్‌లను పూర్తి చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి
  • డిసెంబరు 26 నాటికి క్లయిమ్‌లు పూర్తి
  • బిఎల్‌ఎల జాబితాలు అందజేయాలి
  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

వచ్చే నెల 26వ తేదీ నాటికి ఓటర్ల జాబితాకు సంబంధించిన అన్ని క్లయిమ్‌లను పూర్తి చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో 19వ జిల్లాస్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి, టిడిపి మినహా మిగిలిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బిఎల్‌ఎ) జాబితాలను ఇంకా అందజేయలేదని, వాటిని జిల్లా ఎన్నికల అధికారికి త్వరగా అందజేయాలని కోరారు. ఫారం-6, 7, 8కు సంబంధించి జిల్లాలో 10,728 దరఖాస్తులు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కొత్తగా 72,711 మంది ఓటర్లుగా నమోదయ్యారని, పాత జాబితాలో 42,020 మందిని తొలగించామని, ఇందులో 22,454 మంది మృతి చెందిన వారున్నారని తెలిపారు. క్లయిమ్‌లను స్వీకరించేందుకు డిసెంబరు తొమ్మిదో తేదీ ఆఖరు అని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 2, 3 తేదీల్లో క్లయిమ్‌లను స్వీకరించేందుకు ఆయా బూత్‌ల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మార్పులు, చేర్పులతో ఓటర్ల జాబితా ప్రక్రియను వచ్చే నెల 26వ తేదీ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, కాంగ్రెస్‌ నాయకులు గోవింద మల్లిబాబు, బిఎస్‌పి నాయకులు సోమేశ్వరరావు, బిజెపి నాయకులు కోరాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

➡️