వనరుల కేంద్రాలుగా గ్రంథాలయాలు

Nov 22,2023 22:05
విద్యార్థులు గ్రంథాలయాలను వనరుల కేంద్రాలుగా వినియోగించుకుని విజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

విద్యార్థులు గ్రంథాలయాలను వనరుల కేంద్రాలుగా వినియోగించుకుని విజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు అన్నారు. నగరంలోని కళాశాలలో గల సెమినార్‌ హాల్‌లో జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మంచి పుస్తకం మంచి స్నేహితునితో సమానమన్నారు. గ్రంథాలయాల ఆవశ్యకత, ఆవసరాన్ని గురించి వివరించారు. కళాశాల గ్రంథాలయ విభాగం ఇన్‌ఛార్జి పి.లకీëప్రసన్న భారతి మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం విశిష్టత, అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు, అందుబాటులోకి వచ్చిన డిజిటల్‌ లైబ్రరీ, ఇతర సాంకేతిక అంశాలను వివరించారు. వారం రోజుల పాటు పలు అంశాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి లైబ్రేరియన్‌ సైన్స్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జి.వలసయ్యను ఘనంగా సత్కరించారు. అంతకుముందు లైబ్రేరియన్‌ సైన్స్‌ పితామహుడు ఎస్‌.ఆర్‌ రంగనాథన్‌ చిత్రపటానికి ప్రిన్సిపాల్‌, అతిథులు, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పైడి శంకరనారాయణ, అకడమిక్‌ ఇన్‌ఛార్జి చింతాడ కృష్ణారావు, ఐక్యుఎసి కోఆర్డినేటర్‌ ఎస్‌.పద్మావతి, ఎల్‌.కృష్ణారావు, చిన్నారావు, జ్యోతిలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వలసయ్యను సత్కరిస్తున్న ప్రిన్సిపాల్‌ సూర్యచంద్ర తదితరులు

➡️