జామిలో పంటకోత ప్రయోగాలు

పంటకోత ప్రయోగాన్ని పరిశీలిస్తున్న జెసి

ప్రజాశక్తి-జామి : జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో జామి మండలం జాగారం గ్రామంలో వరి పొలాల్లో బుధవారం పంటకోత ప్రయోగాలు నిర్వహించారు. ప్లాటులో సుమారు 18.680 కిలోల ఉత్పత్తిని నిర్ధారించారు. దీని ప్రకారం ఎకరాకు సగటున సుమారుగా 2,988 కిలోల ఉత్పత్తి నమోదయింది. ఒక్కో బస్తా 75 కిలోల చొప్పన ఎకరాకు సుమారు 39.85 బస్తాల సగటు దిగుబడిగా లెక్కగట్టారు. ఈ ప్రయోగాల్లో జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు, ఉద్యానశాఖ డిడి జమదగ్ని, ముఖ్య ప్రణాళికా శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️