- శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి – పొందూరు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని నందివాడ పంచాయతీ నరసాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల లబ్ధిని చదివి వినిపించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి లోలుగు కాంతారావు, సర్పంచ్ మజ్జి శైలజ, వైసిపి మండల, పట్టణ అధ్యక్షులు పి.రమేష్ కుమార్, జి.నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కిల్లాన సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం