హాంగ్జౌ: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు రెండోరోజు నిరాశ తప్పలేదు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలో కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజవత్ ఓటమిపాలయ్యారు. ప్రియాన్షు రాజవత్..17-21, 14-21 తేడాతో జపాన్‌కు చెందిన కెంటా నిసిమోటో చేతిలో, లక్ష్యసేన్ 19-21, 18-21 తేడాతో చైనాకే చెందిన షి-యు-కి చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూశారు. ఇక కిదాంబి శ్రీకాంత్ 15-21, 21-14, 13-21 తేడాతో థారులాండ్‌కు చెందిన కున్లావత్ వితిద్సరన్ చేతిలో పోరాడి ఓడాడు. మంగళవారం హెచ్ఎస్ ప్రణరు.. పురుషుల డబుల్స్‌లో చిరాగ్-సాత్విక్ గెలిచి రెండోరౌండ్‌కు చేరిన సంగతి తెలిసిందే.