వేదికను మార్చిన ఐసిసి
దుబారు: ఐసిసి అండర్19 వన్డే ప్రపంచకప్ టోర్నీ వేదిక మారింది. ఈ మేరకు ఐసిసి మంగళవారం ఓ ప్రకటనలో దక్షిణాఫ్రికాలో ఈ టోర్నమెంట్ జరగనున్నట్లు వెల్లడించింది. వన్డే ప్రపంచకప్లో శ్రీలంక నిరాశపరచడంతో ఆ దేశ క్రికెట్బోర్డు క్రీడల మంత్రి రద్దు చేయడం తెలిసిందే. దాంతో, క్రికెట్ బోర్డులో రాజకీయ, ప్రభుత్వ జోక్యం తమ నిబంధనలకు విరుద్ధమంటూ ఐసిసి శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో, శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక మారింది. పురుషుల విభాగంలో 15వ అండర్-19 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుందని తెలిపింది. మంగళవారం ఐసిసి బోర్డు సమావేశంలో అండర్-19 వేదిక మార్పు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ… శ్రీలంక జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు, ఐసిసి టోర్నీల్లో పాల్గనవచ్చని వెల్లడించింది.