న్యూఢిల్లీ : కృత్రిమ మేధా (ఎఐ)కి వస్తోన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని టెక్ దిగ్గజం అమెజాన్ ఈ విభాగంలో టెకీలకు నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించింది. ఎఐ రెడీ ప్రోగ్రాం పేరుతో 2025 నాటికి 20 లక్షల మందికి ఎఐ కోర్సును బోధించాలని నిర్దేశించుకుంది. ఎఐ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ సహా ఎనిమిది కోర్సులతో ఎఐ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో అత్యంత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2.1 కోట్ల మంది ఎడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్‌లో శిక్షణ పొందారని తెలిపింది. ఎఐలో మరో 20 లక్షల మందిని నైపుణ్యవంతులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.