రాయల్‌ ఓక్‌ 164 స్టోర్లకు విస్తరణ

Nov 18,2023 21:30 #Business

హైదరాబాద్‌ : ప్రముఖ ఫర్నిచర్‌ బ్రాండ్‌ అయిన రాయల్‌ ఓక్‌ ఫర్నిచర్‌ దేశంలో 164 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. నాచారంలో తమ కొత్త స్టోర్‌ను తెరవడం ద్వారా ఈ మార్క్‌కు చేరినట్లు పేర్కొంది. నూతన స్టోర్‌ ప్రారంభోత్సవంలో రాయల్‌ ఓక్‌ ఫర్నిచర్‌ ఛైర్మన్‌ విజరు సుబ్రమణ్యం, ఎండి మథన్‌ సుబ్రమణ్యం, హోమ్‌ డెకర్‌ ఇరినా మోసెస్‌, తెలుగు రాష్ట్రాల హెడ్‌ నరేష్‌ పాల్గన్నారు. దాదాపు 9వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌ లివింగ్‌ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు, డైనింగ్‌ రూమ్‌లు విస్తృతమైన ఫర్నిచర్‌ కలెక్షన్‌ను అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.

➡️