న్యూయార్క్ : చాట్‌జిపిటి సృష్టికర్త, ఓపెన్ ఎఐ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ ఆ సంస్థకు అనుహ్యాంగా రాజీనామా చేశారు. ఓపెన్ ఎఐ సిఇఒ ‘శామ్ ఆల్ట్‌మన్’ను తొలగించిన నేపథ్యంలో బ్రాక్‌మన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆల్ట్‌మన్ బోర్డులో తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. సంస్థకు సారథ్యం వహించే సామర్థ్యం లేదని ఆయన్ను తొలగించింది. కాగా.. ఆల్ట్‌మన్‌ను కంపెనీ తొలగించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్రాక్‌మాన్ సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటించడం గమనార్హం.