అమెజాన్‌ అలెక్సాలో ఉద్యోగులపై వేటు

Nov 18,2023 21:15 #Business

న్యూయార్క్‌ : గ్లోబల్‌ ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. దిగ్గజ ఇాకామర్స్‌ కంపెనీ అమెజాన్‌ తన వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సాలో వందలాది మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. ఎఐపై దృష్టి సారించడంతో పాటుగా పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు అలెక్సా, ఫైర్‌ టివి విభాగాల వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ రౌశ్‌ తెలిపారు. ఇదే విషయమై శుక్రవారం ఆయన ఉద్యోగులకు మెయిల్‌ చేశారు. ఖచ్చితమైన సంఖ్య చెప్పనప్పటికీ.. వందలాది మందిని ఇంటికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. మారుతున్న వ్యాపార ప్రాధాన్యతల్లో భాగంగా మరింత మెరుగ్గా రాణించే ప్రయత్నంలో కొన్నింటిలో మార్పులు చేపడుతున్నామని లేఖలో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో అమెరికా, కెనడా, భారత్‌లోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. గడిచిన ఏడాది కాలంలో అమెజాన్‌ తన వివిధ విభాగాల్లోని దాదాపు 27వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది.

➡️