ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : జగనన్న విద్యా దీవెన కి జాయింట్ అకౌంట్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరంలో స్థానిక కె.కె. భవన్లో ఎస్ఎఫ్ఐ కర్నూల్ నగర కమిటీ సమావేశం నగర అధ్యక్షులు అమర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించే విద్యా దీవెన, వసతి దీవెన నిబంధనలో తల్లిదండ్రులకు విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో నిబంధనలు పెట్టడం సరైనది కాదు. తల్లిదండ్రులు ఒకచోట విద్యార్థులు మరొకచోట చదువుకుంటూ ఉండటం వలన ప్రస్తుత తరుణంలో జాయింట్ అకౌంట్ చేయడం సమస్యగా మారుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతుండడంతో జాయింట్ అకౌంట్ చేయడానికి సొంత ఊర్లకు విద్యార్థులు రాలేకపోవడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు ఉన్నాయని వీటికి సిద్ధమవుతున్న తరుణంలో వారికి బ్యాంకు ఖాతాలో పేరుతో తిప్పడం సరికాదని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థులు అతి తక్కువ సమయంలో బ్యాంకు ఖాతాలు తీసుకోవడం కూడా కష్టమన్నారు .ఈనెల 28న జేవిడి నిబంధన విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఖాతా నిబంధనలు చాలా నష్టదాయకమని అన్నారు. జాయింట్ అకౌంట్ కు చెందిన సమాచారం ఎక్కువమంది విద్యార్థులకు తెలియదు. మళ్లీ సచివాలయాల్లో అప్లోడ్ చేయాలని కూడా చెప్పడం కూడా విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆఫీసు ఎక్కడ పెట్టలేదు తీసే భాగ్యనగర్‌లో ఉండింది. కాబట్టి.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ అకౌంట్ నిబంధనలను రద్దు చేయాలి లేకపోతే విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అబు బక్కర్ , మల్లేష్ , భాస్కర్, ఆర్యన్ , రాజు తదితరులు పాల్గొన్నారు.