2వ రోజు ఎస్ఎఫ్ఐ నిరవధిక నిరాహార దీక్షలు 

Nov 18,2023 15:39 #SFI, #Vizianagaram

మద్దతు పలికిన ఇఫ్టు, సిఐటియు నాయకులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు శనివారం నాటికి రెండవ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి హెచ్. వెంకటేష్ , పి రామ్మోహన్ లు మాట్లాడుతూ జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ,ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు అని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం కడవరకు పోరాడే సంఘం ఎస్ ఎఫ్ ఐ అని, దానికి అనుగుణంగానే ఈ దీక్ష బృందం ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిన సరే మా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. తదనంతర పరిణామాలకు , విద్యార్థుల ఆందోళనకు జిల్లా విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.21 న మంగళవారం జరిగే చలో కలెక్టరేట్ నీ జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా దీక్షలకు మద్దతు ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షులు కె. అప్పలసూరి  మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయిస్తుందని , అవి ఎటు వైపు మల్లుతున్నాయని విమర్శించారు. సమస్యలు పరిష్కారం చేయమంటే ప్రభుత్వం గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్టు చూస్తుంది అని దుయ్యబట్టారు. ఎస్ ఎఫ్ ఐ చేసే ఈ దీక్షలకు ఇఫ్టు మద్దతు ఉంటుందని తెలిపారు. దీక్షలకు సి ఐ టి యు నాయకులు నాగభూషణం  మద్దతు పలికారు. దీక్షకు పలువురు విద్యార్దులు మద్దతు పలికారు.

తాజా వార్తలు

➡️