ఇంటర్నెట్‌డెస్క్ : హీరోయిన్ రష్మికని టార్గెట్‌గా చేసుకుని కొంతమంది ఆకతాయిలు ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలపై బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కీర్తిసురేష్, ప్రముఖ హీరో నాగచైతన్య వంటి ప్రముఖ తారాగణం మండిపడింది. రష్మిక ఫేక్ వీడియోలను పోస్టు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఫేక్ వీడియోలను పోస్ట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. బీహార్‌కి చెందిన 19 ఏళ్ల యువకుడు ఈ వీడియోలను పోస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో.. రష్మిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి అతను కాదని తేలిందట. తాను కూడా వేరే సోషల్‌మీడియా ప్లాట్ఫారం నుంచి వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నట్లు పోలీసులకు చెప్పాడట. దీంతో పోలీసులు రష్మిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు.