ఉద్యమాలతో ముందుకు.. : ప్రజారక్షణ భేరి సభలో వక్తలు

Nov 16,2023 14:25
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాడటం ద్వారానే వారికి న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. విజయవాడ సింగ్‌నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాట్లాడారు.

  • మహిళలకు న్యాయం మిధ్య :  ఎస్‌.పుణ్యవతి

కేంద్రంలో బిజెపి తీరువల్ల మహిళలకు న్యాయం జరగడం అనేది మిధ్యగా మారిందని, వారి హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి అన్నారు. చట్టసభల్లో మహిళలకు హక్కులు కల్పించకుండా ఎన్నికల్లో లబ్ధి కోసం మోసం చేస్తున్నారని అన్నారు. రాజకీయానికి అర్థం ఓట్లు, సీట్లు అని చెప్పే వారికి సిపిఎం భారీ ప్రదర్శన ఒక హెచ్చరిక అన్నారు. ఈ సందర్భంగా ‘ఒక్కరోజైనా, ఒక్కనాడైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా’ అనే పాటపాడి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ప్రజలకు అనుకూలంగా ఉండే మీడియాను చూసినా, వామపక్ష భావాలను చూసినా బిజెపికి వెన్నులో వణుకుపుడుతుందుని, న్యూస్‌ క్లిక్‌పై దాడి అందులో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే రెండుకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మోడీ చెప్పారని ఇద్దరికి కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలను నాశనం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని అన్నారు. విశాఖ స్టీలును కాపాడుకోవడం కోసం వేయి రోజులుగా కార్మికులు పోరాడుతున్నారని, ఇదే స్ఫూర్తితో సాగితే ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చని అన్నారు. దళితులను ఉద్దరిస్తామని రాష్ట్రంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి చెబుతున్నా ఇప్పటికీ అనేక గ్రామాల్లో వారికి శ్మశాసనవాటికలు లేవని పేర్కొన్నారు.

తాజా వార్తలు

➡️