పాలిటెక్నిక్‌ ద్వారా చిన్న వయస్సులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు

Apr 28,2025 22:37

విద్యార్థులతో ముఖ్య అతిథులు

పాలిటెక్నిక్‌ ద్వారా చిన్న వయస్సులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు
– జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌
– టీజీవీ కళాక్షేత్రంలో విద్య అకాడమి కల్చరల్‌ అండ్‌ మోటివేషన్‌ కార్యక్రమం
ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్‌
పాలిటెక్నిక్‌ ద్వారా చిన్న వయస్సులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు విద్యతో పాటు విలువలు, సామాజిక సేవ దక్పథం పెంపొందించుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌ అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని టీజీవి కళా క్షేత్రం నందు విద్య అకాడమిలో పాలిటెక్నిక్‌ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులకు కల్చరల్‌ అండ్‌ మోటివేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌ హాజరై మాట్లాడారు. ప్రణాళిక బద్ధంగా చదువుకుంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. పాలిటెక్నిక్‌ చదవడం ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు పొంది చిన్న వయసులోనే స్థిరపడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్య అకాడమి డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరమ్మ, రాయలసీమ విద్యార్థి జెఎసి చైర్మన్‌ అడ్వకేట్‌ కోనేటి వెంకటేశ్వర్లు, విద్యావేత్తలు డాక్టర్‌ కెవి.సుబ్బారెడ్డి, జి.పుల్లయ్య, డాక్టర్‌ కొట్టే చెన్నయ్య, కార్తీక్‌ నాయుడు, రఘువీర్‌, బాల రాజు, చింతలపల్లి రామకష్ణ, టి.గోపీనాథ్‌, అంచ పెద్దస్వామి, బుర్రా చంద్ర మోహన్‌, సురేంద్ర బాపూజీ, ముద్దం మధుసూదన రావు, రిటైర్డ్‌ ఆర్టీవో కోనేటి చంద్రబాబు, ప్రముఖ జర్నలిస్టు వడ్ల శ్రీకాంత్‌, రిటైర్డ్‌ ఆర్మీ కెప్టెన్‌ సాన మద్దిలేటి, జనసేన పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రేఖ గౌడ్‌, రాయలసీమ జోన్‌ కన్వీనర్‌ పి పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

➡️