15, 16న సాయి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హాస్టల్‌ సీట్లకు ఎంపిక

Feb 6,2025 17:29

కారూ్ట‌న్‌

15, 16న సాయి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హాస్టల్‌ సీట్లకు ఎంపిక
ప్రజాశక్తి – కర్నూలు జిల్లా పరిషత్‌
కర్నూలు నగరంలోని అవుట్‌ డోర్‌ స్టేడియంలో ఉన్న సాయి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, స్టేట లెవల్‌ ఖేలో ఇండియా సెంటర్‌ హాస్టల్‌లో సీట్లకు తైక్వాండో, హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో అర్హులైన బాలుర అభ్యర్థులకు ఈ నెల 15, 16వ తేదీల్లో ఎంపిక నిర్వహిస్తున్నట్లు సెంటర్‌ ఇన్‌ఛార్జి పి.చంద్రశేఖర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలురు 2008 నుండి 2013 మధ్య జన్మించి ఉండాలని, జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో బహుమతులు సాధించి ఉండాలన్నారు. బాలురు సంబంధిత క్రీడా సర్టిఫకెట్లు, బర్త్‌ సర్టిఫికెట్టు, ఎస్‌ఎస్‌సి, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, ఇటీవల దిగిన పాస్‌ఫొటోలు 5, ఆధార్‌ కార్డు తదితర ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 15వ తేదీ ఉదయం 7 గంటలకు కర్నూలు నగరంలోని అవుట్‌ డోర్‌ స్టేడియంకు రావాలని తెలిపారు. తైక్వాండో కోచ్‌ కార్తికేయ, హాండ్‌బాల్‌కోచ్‌ జితెన్‌సింగ్‌ ఉంటారని తెలిపారు. ఎంపికయిన వారికి బోర్డింగ్‌ ఎక్స్‌పెన్‌సెస్‌ ఒక్కొక్కరికి రోజుకు రూ.300, స్పోర్ట్స్‌కిట్‌ కోసం ఏడాదికి రూ.8000 , కాంపిటేషన్‌ ఎక్స్‌పెన్‌సెస్‌ ఏడాదికి రూ 6000, ఎడ్యుకేషన్‌, మెడికల్‌, ఇన్సూరెన్స్‌ , ఎక్స్‌పెన్‌సెస్‌ తదితరాలు ఏడాదికి 10,000 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇతర వివరాలకు సెంటర్‌ ఇన్‌ఛార్జి సెల్‌ నంబర్‌ 9966377846 సంప్రదించాలని కోరారు.

తాజా వార్తలు

➡️