ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 39వ డివిజన్ అలకానంద కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బిటి రహదారికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం జోనల్ ఇన్చార్జి డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ నగరంలో ఎన్నడూ లేనంత అభివద్ధి సుందరీకరణ పనులు ఆశించిన దానికన్నా ఎక్కువగా జరి గాయన్నారు. చేసిన అభివృద్ధిని అభినందిం చాల్సింది పోయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వింత ప్రభాకర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, జోనల్ ఇంచార్జ్ కోలగట్ల తమన్న శెట్టి, డిప్యూటీ మేయర్ లయాయాదవ్, కార్పొరేటర్ పిన్నింటి కళావతి తదితరులు పాల్గొన్నారు.