మా అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కెసిఆర్‌ ప్రయత్నిస్తున్నారు : డీకే శివకుమార్‌

బెంగళూరు : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి డీకే బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ … ” కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన స్వయంగా సంప్రదించినట్లు తమ పార్టీ అభ్యర్థులు చెప్పారని అన్నారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదని డీకే స్పష్టం చేశారు.

➡️