ముంబయి: భారత్ాఎ, ఇంగ్లండ్-ఎ జట్ల మధ్య జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ బ్యాటర్ వాంగ్స్ మెరిసింది. దీంతో ఆ జట్టు రెండో టి20లో నాలుగు వికెట్ల తేడాతో భారత్ాఎపై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన భారత్ాఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 149పరుగులు చేసింది. కనిక అహుజ(27), ఛెత్రీ(26), గోయల్(26) బ్యాటింగ్లో రాణించారు. క్రిస్టీ జోర్డాన్(3/28) బౌలింగ్లో మెరిసింది. అనంతరం ఇంగ్లండ్ాఎ జట్టు 18.5 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 151పరుగులు చేసి గెలిచింది. ఇసీ వాంగ్(35నాటౌట్) బ్యాటింగ్లో రాణించింది. మిన్ను మణికి రెండు వికెట్లు దక్కాయి. దీంతో ఇరుజట్ల మధ్య జరుగుతున్న మూడు టి20ల సిరీస్ 1-1తో సమం కాగా.. ఆదివారం మూడో, చివరి టి20 జరగనుంది.