న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది నవంబర్‌లో దేశంలో రూ.1,67,929 కోట్ల వస్తు సేవల పన్నులు (జిఎస్‌టి) వసూళ్లయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం పెరిగాయి. గడిచిన నెల వసూళ్లలో సిజిఎస్‌టి వాటా రూ.30,420 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.38,226 కోట్లు. ఐజిఎస్‌టి రూపంలో రూ.87,009 కోట్ల చొప్పున వసూళ్లయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అదే విధంగా సెస్సుల రూపంలో రూ.12,274 కోట్లు వచ్చాయని పేర్కొంది. ప్రస్తుత 2023-24లో జిఎస్‌టి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి కావడం విశేషం. గడిచిన నెలలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,093 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది నెలలోని రూ.3,134 కోట్ల వసూళ్లతో పోలిస్తే 31 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. క్రితం నెలలో తెలంగాణలో 18 శాతం వృద్థితో రూ.4,986 కోట్ల జిఎస్‌టి వసూళ్లు కాగా.. గతేడాది ఇదే నెలలో 4,228 కోట్లు వసూళ్లు జరిగాయి.