2,3 తేదీలలో బూత్‌ స్థాయిలో ప్రత్యేక కాంపెయిన్‌

Dec 1,2023 20:22

ప్రజాశక్తి-విజయనగరం  :  ఓటరుగా నమోదు కావడానికి షిఫ్టింగ్‌ , తొలగింపు, మార్పుల కోసం ఆఖరి గడువు ఈనెల 9 అని, ఆ తర్వాత జరిగిన చేర్పులు గానీ, మార్పులు గానీ ఈ జాబితా లోనికి రావని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 2, 3 తేదీలలో ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద స్పెషల్‌ కాంపెయిన్‌ జరుగుతుందని, ప్రతి బిఎల్‌ఒ ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ వద్ద అందుబాటులో ఉంటారని ఓటరుగా నమోదు కాని వారు, మార్పులు కోరుకునేవారు , తొలగింపుల కోసం తగు దరఖాస్తులతో బూత్‌ వద్దకు వెళ్ళాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ విషయంపై వాలంటీర్‌ ద్వారా ప్రతి గ్రామం లో అందరికీ తెలిసేలా ప్రచారం చేపట్టాలని తెలిపారు. శుక్రవారం తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మాట్లాడారు. స్పెషల్‌ కాంపెయినలో ఇఆర్‌ఒలు ప్రతి బూత్‌ ను తనిఖీ చేయాలని, ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు బిఎల్‌ఒలు బూత్‌ ల వద్ద ఉండాలని, ఏ క్షణంలో లేకపోయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలిపారు. ఓటర్లలో 18,19 ఏళ్ల వారి సంఖ్య 8 వేల వరకు పెరిగిందని, ఇంకా 2 వేల దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయని, అయితే మరో 20 వేల వరకు అర్హులైన వారు ఉన్నారని తెలిపారు. ఇఆర్‌ఒ లు అన్ని కళాశాలలను సందర్శించి దరఖాస్తులను తీసుకోవాలని తెలిపారు. ఈనెల 8లోగా వాటిని ఆన్‌లైన్‌ చేయాలని, అప్పుడు మాత్రమే ఈ జాబితాలో ఓటరుగా నమోదు అవుతారని తెలిపారు. సమావేశంలో జెసి మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ అనిత, ఇఆర్‌ఒలు వెంకటేశ్వర రావు, నూక రాజు, దొర, సుధారాణి, ఎన్నికల సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️