ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

Dec 1,2023 13:02 #Anantapuram District
awareness on aids day

ప్రజాశక్తి-రాయదుర్గం : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాయదుర్గం పట్టణంలో ర్యాలీ జరిగింది. రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పొరాలు శిల్ప జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం.. నిరంతరం జాగరూకత నింపుదాం అని నేతలు పిలుపునిచ్చారు.
రాయదుర్గం పట్టణంలో మాస్ ఎడుకేషన్ సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ ఐసిటిసి విభాగం సంయుక్తంగా పట్టణంలో జరిపిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి పురపాలక మండలి సభ్యులు మున్సిపల్ వైద్య ఆరోగ్య సిబ్బంది మాస్ ఎడ్యుకేషన్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి వినాయక సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీ ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వినాయక కూడలిలో పాల్గొన్న వారిచే ప్రతి చేయించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్ఐవి కివ్యతిరేకంగా పోరాడడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మరియు విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.

➡️