మౌంట్ పోర్టు పాఠశాలలో వెజిటేబుల్స్ డే

Nov 30,2023 23:45

ప్రజాశక్తి – రేపల్లె
మౌంట్ పోర్టు పాఠశాల నందు వెజిటేబుల్స్ డే గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాలైన కూరగాయలను, ఆకుకూరలను సేకరించి పాఠశాల యందు చిన్నచిన్న స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ రకాలైన కూరగాయలు, వాటి ప్రాముఖ్యతను సాంస్కృతిక, సృజనాత్మక ఆకృతులతలతో అందరికీ వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అందరూ వివిధ రకాలైన జంక్ ఫుడ్‌లకు అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. మనం తినే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకొవటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చని సూచించారు. తల్లి దండ్రులు, పాటశాల విద్యార్థులు కూరగాయల స్టాల్స్ లను సందర్శించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్ బ్రదర్ జాన్ పాల్ పాల్గొన్నారు.

➡️