యుటిఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Nov 30,2023 23:39

ప్రజాశక్తి – అద్దంకి
యుటిఎఫ్‌ మండల సర్వసభ్య సమావేశం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. సమావేశంలో యుటిఎఫ్ మండల నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడుగా ఇట్టా రామారావు, ప్రధాన కార్యదర్శిగా బి పూర్ణచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మూజి శ్రీనివాసరావు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ పోరాటం చేస్తున్నదని అన్నారు. రానున్న రోజుల్లో యుటిఎఫ్‌ చేసే పోరాటాలకు ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని కోరారు. యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులను వేధించటం, మెమోలు, షో కాజ్ నోటీసులు ఇవ్వడం హేయమైన చర్యని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై చేస్తున్న ఒత్తిడిని ఆపకపోతే పోరాటం ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు. పి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి హరిబాబు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జె బాబురావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు కెవి శ్రీనివాసరావు, ఎస్ హనుమంతరావు, కె గంగాధర్, డి రామాంజనేయులు, ఎస్‌కె మస్తాన్ వలి, బి చంద్రశేఖర్, పి బ్రహ్మం పాల్గొన్నారు.

➡️