బెంగళూరు : ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా కొత్తగా యుపిఐ చెల్లింపుల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. తమ వినియోగదారులు ఇకపై ఓలా యాప్‌లోనే డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. యాప్‌లో యుపిఐ పేమెంట్స్ ఫీచర్‌ని ఆ సంస్థ జత చేసింది. దీంతో యాప్ ద్వారానే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి నగదు చెల్లించవచ్చని ఓలా పేర్కొంది. ఈ ఫీచర్ మొదట బెంగళూరులో అందుబాటులో తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.