ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
అర్హత కలిగిన ప్రతి విద్యార్థీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎ.దుర్గేష్ తెలిపారు. గురువారం శశి ఇంజినీరింగ్ కళాశాలలో ఓటరు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్త ఓటరు కార్డు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ ఎన్ఎస్ఎస్వి.ప్రసాద్ మాట్లాడుతూ ఓటు ద్వారా మంచి నేతను ఎన్నుకుంటే భవిషత్తు బాగుంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, వాలంటీరు పాల్గొన్నారు.