ప్రాపర్టీ కేసులు ఛేదించాలి

ప్రాపర్టీ కేసుల నియంత్రణ చర్యలు చేపట్టాలని, దర్యాప్తులో ఉన్న ప్రాపర్టీ కేసులు ఛేదించాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక దిశ నిర్ధేశం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అక్టోబరు నెలకు సంబంధించిన

ప్రశంసపత్రాన్ని అందజేస్తున్న ఎస్‌పి రాధిక

  •  

నేర సమీక్షలో ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం

ప్రాపర్టీ కేసుల నియంత్రణ చర్యలు చేపట్టాలని, దర్యాప్తులో ఉన్న ప్రాపర్టీ కేసులు ఛేదించాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక దిశ నిర్ధేశం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అక్టోబరు నెలకు సంబంధించిన కేసులపై బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాల నివారణకు ప్రణాళికాబద్ధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆస్తి నేరాలు దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు. నేరస్తులను, కేసు ప్రాపర్టీని ఛేదించాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించి కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. దర్యాప్తు పెండింగ్‌ ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. జగన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో అందే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు. చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి సత్ప్రవర్తనతో నడుచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పగటి పూట, రాత్రి వేళ గస్తీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులపై దృష్టిసారించాలన్నారు. నాన్‌ బెయిల్‌ వారెంట్స్‌ వీలైనంత వరకు అమలు చేసి న్యాయస్థానంలో హాజరు పరచాలన్నారు. గ్రేవు కేసుల్లో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలన్నారు.ఉత్తమ ప్రతిభకు ప్రసంశాపత్రాలుఎక్కువ మొత్తంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదులో ట్రాఫిక్‌ డిఎస్‌పి సిహెచ్‌.జి.వి.ప్రసాదరావు, జి.అప్పారావు (ఎస్‌ఐ సారవకోట) ఎల్‌.రామకృష్ణ (ఎస్‌ఐ టెక్కలి) దర్యాప్తులో ఉన్న కేసులు ఫైనలేజ్లో వి.సత్యనారాయణ (ఎస్‌ఐ ఎచ్చెర్ల), ఖాదర్‌ బాషా (కాశీబుగ్గ ఎస్‌ఐ), ఎ.విజయ కుమార్‌ (శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ), నర్సింగరావు (మెళియాపుట్టి ఎఎస్‌ఐ), బెస్ట్‌ రైటర్స్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుళ్లు, అంకిత భావంతో విధులు నిర్వహించే మహిళ పోలీసులకు అభినందిస్తూ ప్రసంశాపత్రాలను అందజేశారు. సిఐ రవి ప్రసాద్‌కు సన్మానంగతంలో సోంపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి బదిలీ అయిన రవిప్రసాద్‌కు ఎస్‌పి దుశ్శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. సమీక్షలో అదనపు ఎస్‌పి టి.పి.విఠలేశ్వరరావు,జె.తిపేస్వామి, డిఎస్‌పిలు .బాలచంద్రారెడ్డి, డి.నాగేశ్వరరెడ్డి, విజయకుమార్‌, ఎస్‌.వాసుదేవ్‌, జి.వి.ప్రసాద్‌, ట్రైనీ డిఎస్పఇ సిహెచ్‌.రాజా, ఎఒ పరిపాలన అధికారి సిహెచ్‌.గోపీనాథ్‌ పాల్గొన్నారు.

 

➡️