సాయిరాజ్‌ పరామర్శ

మండలం కేదారిపురం పంచాయతీ గ్రామంలో నర్సింగ్‌ శెట్టి పూరి ఇల్లు ఇటివలే అగ్నిప్రమాదం వల్ల పూర్తిగా కాలిపోవడంతో విషయం తెలుసుకున్న వైసిపి ఇన్‌ఛార్జి పిరియా సాయిరాజ్‌ బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం తరుపున అందాల్సిన సాయం సకాలంలో అందజేసేట్టు

బాధిత కుటుంబానికి పరామర్శ చేస్తున్న సాయిరాజ్‌

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

మండలం కేదారిపురం పంచాయతీ గ్రామంలో నర్సింగ్‌ శెట్టి పూరి ఇల్లు ఇటివలే అగ్నిప్రమాదం వల్ల పూర్తిగా కాలిపోవడంతో విషయం తెలుసుకున్న వైసిపి ఇన్‌ఛార్జి పిరియా సాయిరాజ్‌ బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం తరుపున అందాల్సిన సాయం సకాలంలో అందజేసేట్టు చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించారు. అంతకు ముందు వై నీడ్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే మళ్ళీ జగన్‌ రావాలి అన్నారు. కార్యక్రమంలో సీడ్‌ ఎపి చైర్మన్‌ శాడి శ్యాం ప్రసాద్‌ రెడ్డి, రెడ్డిక కార్పోరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పడ నారాయణమ్మ, వైస్‌ ఎంపిపి దువ్వు వివేకానంద, మండల పార్టీ అధ్యక్షులు పాతిర్ల రాజశేఖర్‌ రెడ్డి, టౌన్‌ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌ పట్నాయక్‌, మండల జెసిఎస్‌ అధ్యక్షులు ఆశి పురుషోత్తం, టౌన్‌ అధ్యక్షులు సాలిన ఢిల్లీరావు, సర్పంచ్‌ నీలాపు సారధి, కారంగి మోహనరావు, ఉప్పడ రాజారెడ్డి, పిలక సంతు, నర్తు శివాజీ, దక్కత నూకయ్య రెడ్డి, రంపత్ని చిట్టిబాబు, కోగయ్య రెడ్డి పాల్గొన్నారు.

 

➡️