మండల బడ్జెట్‌ ఆమోదం

మండల పరిషత్‌ 2023-24 సంవత్సర సవరణ బడ్జెట్‌, 2024-25 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా

మాట్లాడుతున్న ఎంపిపి శ్రీరామ్మూర్తి

నందిగాం: మండల పరిషత్‌ 2023-24 సంవత్సర సవరణ బడ్జెట్‌, 2024-25 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. బడ్జెట్‌ సమావేశం బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్లో వచ్చిన ఆదాయనికి గాను 15శాతం షెడ్యూల్‌ కులాల సంక్షేమానికి, 6శాతం షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం కొరకు, 15శాతం మహిళా శిశు సంక్షేమానికి కేటాయించారు. 12శాతం తాగునీరు, 23శాతం మెయింటెనెన్స్‌, 15శాతం కార్యాలయపు నిర్వహణ నిమిత్తం, 10శాతం మండల సెక్టోరియల్‌ యాక్టివిటీ, నాలుగు శాతం కంటిన్జెన్సీ అగంతక వ్యయం కేటాయిస్తూ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎంపిడిఒ శివప్రసాద్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, వైస్‌ ఎంపిపిలు సువ్వారి వసంత కుమార్‌, ఆర్‌. లక్ష్మీకాంతం, ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

 

➡️