రైతుల అప్రమత్తంగా ఉండాలి

Nov 29,2023 23:29

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు)
బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో డిసెంబర్ 2నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని వేమూరు ఎఒ సునీత సూచించారు. అమె మాట్లాడుతూ డిసెంబర్ 5వరకు జిల్లాలో ఒక మోస్తరు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపిందని అన్నారు. కోతకు సిద్దంగా ఉన్న వరి పొలాల్లో రైతులు పంటలను జాగ్రత్త పరుచుకొని ఇంటికి చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో వరి పంటకు తీవ్ర నష్టం జరిగే సూచనలు ఉన్నట్లుగా హెచ్చరించారు. సిద్ధంగా ఉన్నపంటలను హార్వెస్టర్ వినియోగించుకునైనా కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

➡️