విజయపురిసౌత్: మానవ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరం అని, దానిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ప్రజ్వల ప్రాజెక్టు సీనియర్ మేనేజర్ బలరామకృష్ణ అన్నారు.బుధవారం విజయపురిసౌత్ లోని ఏపిఅర్ జూనియర్ కళాశాలలో మానవ అక్రమ రవాణా నివా రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బలరామకృష్ణ మాట్లాడుతూ మనుషులను అపహరించి వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించడం నేరమని, మానవ అక్రమ రవాణాను ఆరికట్టడం మనందరి బాధ్యత అన్నారు. పిల్లలు, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడే వారిపై తీసుకునే చర్యలపై వివరించారు. డ్రగ్స్, ఆయు ధాల అక్రమ రవాణా ఎంత నేరమో మానవ అక్రమ రవాణా అంతే నేరం అన్నారు. యువత ఇంట ర్నెట్, మొబైల్ ద్వారా సైబర్ ట్రాఫికింగ్‌కి గురవు తున్నా రన్నారు. అలాంటి ఉచ్చులో పడకుండా ప్రజలను అప్ర మత్తం చేయాలన్నారు.మహిళా సంఘాల సభ్యులు అవ గాహన కార్యక్రమాలతో వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సరోజిని, ప్రజ్వల, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ,శ్రావ్య వతి ,శివ, అనిల్ పాల్గొన్నారు.