సహకార బ్యాంక్‌ రుణాలపై అవగాహన

సహకార బ్యాంక్‌

ప్రజాశక్తి- గోకవరంరంపఎర్రంపాలెంలో గోకవరం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ బ్యాంకు ద్వారా 3 రకాల రుణాలు ఇస్తున్నామని తెలిపారు. కెసిసి ద్వారా రుణాలు తీసుకుని ఒక సంవత్సరం లోపు చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. దీర్ఘకాలిక రుణాలులో రైతు నేస్తం ఒక ఎకరానికి రూ.8 లక్షలు రుణాలు ఇస్తుందని, నూటికి రూపాయి వడ్డీ ఉంటుందని, వడ్డీ రాయితీ కూడా ఇస్తుందని తెలిపారు. కాల పరిమితి 10 ఏళ్లు ఉంటుందన్నారు. డ్వాక్రా రుణాలు, గోల్డ్‌ లోన్లు కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ బ్యాంకు ద్వారా జీరో అకౌంట్‌ చేసిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద మొదటి సంవత్సరం బీమా సొమ్మును బ్యాంకు వారు చెల్లిస్తారన్నారు. 70 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బీమాను సద్వినియోగం చేసుకుని రూ.రెండు వరకు రుణాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ పాటి రాంబాబు, బ్యాంక్‌ సూపర్‌వైజర్‌ కె.ప్రదీప్‌ చంద్ర, స్టాప్‌ అసిస్టెంట్‌ బి.శ్వేత, సొసైటీ సిబ్బంది శ్రీనివాస్‌, అప్పన్న బాబు, సొసైటీ డైరెక్టర్‌ తోట సత్యనారాయణ, డి.వెంకటరత్నం, శివ పాల్గొన్నారు.

➡️