చెత్త శుద్ధి వాహనాలు ప్రారంభం

ప్రజాశక్తి – ఏలూరు

పరిసరాల్లోని మురుగునీరు, చెత్త తొలగింపునకు మురుగుశుద్ధి చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బి.లావణ్యవేణి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో స్వచ్ఛత ఉద్యమ యోజన కింద ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి ఆర్థిక సహాయంతో రాష్ట్ర షెడ్యూల్డు కులాల ఆర్థిక సంస్ధ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు రూ.మూడు వేల లీటర్ల సామర్థ్యం గల డిసడ్లింగ్‌ మురుగుశుద్ధి వాహనాలను అందజేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం మురుగునీరు, చెత్త నిర్మూలనా వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. వాహనం విలువ రూ.31.67 లక్షలు కాగా ఇందులో సబ్సిడీ కింద రూ.15.06 లక్షలు, ఎన్‌ఎస్‌కెఎఫ్‌ డిసి రుణం కింద రూ.16.61 లక్షలు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మోహన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, ఎస్‌సి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.కుముదినిసింగ్‌, మేతర అజరుబాబు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

➡️