ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌తోపాటు సహాయ సిబ్బంది కాంట్రాక్టులను పొడిగించింది. ఈ మేరకు బిసిసిఐ మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి వన్డే ప్రపంచకప్ తర్వాత ద్రావిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియగా.. భారత్ కొత్త కోచ్ కోసం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వివిఎస్ లక్ష్మణ్‌కు ఇప్పటికే ఎన్సిఏ బాధ్యతలు ఉండగా నెహ్రా కూడా ఐపిఎల్‌తో పాటు ఇతర బాధ్యతల కారణంగా హెడ్‌కోచ్ పదవికి విముఖత చూపించడంతో ద్రావిడ్‌నే కొనసాగించేందుకు బిసిసిఐ అంగీకరించినట్లు సమాచారం. ద్రావిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌ల కాంట్రాక్టు కూడా పొడిగించింది. ద్రావిడ్‌ను వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ వరకు కొనసాగించనున్నట్లు సమాచారం.