ప్రభుత్వ కార్యక్రమాలు అయితే మాకేం …!

Nov 29,2023 11:39 #Anantapuram District
govt officers neglect

ప్రజాశక్తి-ఆత్మకూరు : ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి లేదా మండల స్థాయి కార్యక్రమాలకు సంబంధించి మండల స్థాయి అధికారులు విలేకరులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ ఆత్మకూరు మండలంలో అధికారులు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకైనా ఏ సమావేశాలకైనా కనీస సమాచారం ఇవ్వకుండా వచ్చామా వెళ్ళామా అన్నట్టు కార్యక్రమాలను ముగిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అధికారులు ఫీల్డ్ కు వెళ్ళామంటూ కార్యాలయాలకు రాకుండా డుమ్మా కొడుతున్నారు. ఉదయం 11 గంటలు దాటిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తలుపులు కూడా తెరవడం లేదు. ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన అధికారులే ఇలా ఉండటం నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్టుంది.

➡️