పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న గుండుమల తిప్పేస్వామి, తదితరులు
మడకశిర :రాష్ట్ర వ్యాప్తంగా బిసిలకు అన్ని రంగాల్లో ద్రోహం చేస్తున్న సిఎం జగన్‌కు బుద్ధి చెప్పా లని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌మూర్తి తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు ‘బిసిల వెన్ను విరిసిన జగన్‌రెడ్డి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తితిదే ఛైర్మన్ పదవికి బిసిలు పనికిరారా అని ప్రశ్నించారు. బిసి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం, ఆదరణ లాంటి 30కి పైగా సంక్షేమ పథకాల రద్దు, బిసి రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గింపు, అనేక రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంద న్నారు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల కబ్జా చేశారని, అందులో అత్యధిక భాగం బిసిలవే అన్నారు. 70 వేలకు పైగా బిసి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. 1000 బిసి భవనాలు, 887 కమిటీ హాళ్ల నిర్మాణం నిలిపేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో 3 బిసి గురుకుల కళాశాల, పాఠశాల భవనాల నిర్మాణం ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, లక్ష్మీనరసప్ప, కృష్ణమూర్తి, రవికుమార్, రవీంద్రరెడ్డి, శ్రీనివాస్, పాండురంగప్ప, చంద్రనాయక్, వెంకటరమణ పాల్గొన్నారు.