మోహన్‌ కిషోర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Nov 28,2023 20:56
వస్త్రదానం చేస్తున్న సురేష్‌ రెడ్డి కుటుబసభ్యులు

వస్త్రదానం చేస్తున్న సురేష్‌ రెడ్డి కుటుబసభ్యులు
మోహన్‌ కిషోర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు సురేష్‌ రెడ్డి చికెన్‌ సెంటర్‌ అధినేత సన్నారెడ్డి సురేష్‌ రెడ్డి వితరణ వాదిగా గుర్తింపు పొందారు. కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఆహారాన్ని, నిత్యావసరాలను అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. సురేష్‌ రెడ్డి అగర్తలలోని ఎన్‌ఐఐటిలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న సురేష్‌ రెడ్డి చిన్న కుమారుడు మోహన్‌ కిషోర్‌ రెడ్డి సేవా కార్యక్రమాల్లో తన తండ్రి బాటనే అనుసరించడం అభినందనీయం. మోహన్‌ కిషోర్‌ రెడ్డి తన జన్మదిన వేడుకలలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మహాదేవపురం గ్రామంలోని యానాది సంఘం లోని 40 కుటుంబాలలోనీ 150 మందికి అన్న, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.ల

➡️