ఈడి నోటీసులపై స్టే విధించిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై :   తమిళనాడు కలెక్టర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ఇచ్చిన నోటీసులపై మంగళవారం మద్రాస్‌ హైకోర్టు స్టేవిధించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. నంతకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌.ఎస్‌. సుందర్‌, జస్టిస్‌ సుందర్‌ మోహినీలతో కూడిన ద్విసభ ధర్మాసనం తమ నిర్నయాన్ని ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఈడి నోటీసులపై స్టే విధించింది.

ఇసుక మైనింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను అందించేందుకు వివిధ తేదీల్లో కలెక్టర్లు వ్యక్తిగత హాజరును తప్పనిసరి చేసిన ఈడి సమన్లు చెల్లుబాటు కానివిగా ప్రకటించాలని పిటిషన్‌ పేర్కొంది. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక మైనింగ్‌ చేపడుతున్నారని ఆరోపిస్తూ అరియాలూర్‌, వెల్లోర్‌, తంజావూర్‌, కరూర్‌, మరియు తిరుచినాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈసి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

➡️