ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో స్థానిక పంచాయతీ కార్యాలయం పక్కన సుమారు 30 లక్షల రూపాయల నిధులతో సర్వాంగ సుందరంగా నూతన గ్రంథాలయ భవనం అన్ని ఏర్పాట్లతో ప్రారంభానికి సిద్ధమయ్యింది. గతంలో ఉన్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆ గ్రంథాలయ భవన స్థలంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మాణం కోసం గత పది సంవత్సరాల నుండి పలువురు పాఠకులు, స్థానికులు, నిరుద్యోగులు నార్పలకు ఏ ప్రజా ప్రతినిధి వచ్చిన ఏ ఉన్నతాధికారి వచ్చిన గ్రంథాలయం నిర్మించండి అంటూ వినతి పత్రాలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. సుమారు 20 వేల వరకు జనాభా ఉన్న మేజర్ పంచాయతీలో సరైన గ్రంథాలయ భవనం లేక ఇంతకాలం అద్దె భవనాల్లోనూ తాత్కాలిక ప్రభుత్వ భవనాల్లోనూ గ్రంధాలయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. నార్పలలోని గ్రంథాలయ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి దఅష్టికి తీసుకొని వెళ్లి పాత గ్రంథాలయ భవన స్థలంలోనే అధునాతనమైన నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సఫలీకఅతం అయ్యారు. దీంతో పలువురు పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ … నూతన గ్రంథాలయ భవనంలో నిరుపేద విద్యార్థులు నిరుద్యోగులను దఅష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికోసం వారికి అవసరమైన పుస్తకాలను కూడా ఎవరైనా దాతలు స్పందించి గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఈ గ్రంధాలయ ప్రారంభానికి సిద్ధం అయిన తాత్కాలిక తహశీల్దార్ కార్యాలయం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం పూర్తి శిథిలావస్థకు చేరి అధికారులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ప్రజాశక్తి చాలాసార్లు వార్తల రూపంలో ఉన్నతాధికారుల దఅష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన అధికారులు ప్రజాప్రతినిధులు నార్పల లోని స్థానిక విద్యాధికారి కార్యాలయం వెనుక పాత ప్రాథమిక పాఠశాల భవనాల్లో తాత్కాలిక తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా గత కొద్ది రోజుల నుండి తాత్కాలిక తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. గ్రంథాలయ భవనంతో పాటు అతి త్వరలోనే తాత్కాలిక తహశీల్దార్ కార్యాలయం కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది.