క్రీడాకారులను అభినందిస్తున్న డిఆర్డిఎ పీడీ విద్యాసాగర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహరాడూన్లో డిశంబరు 1 నుంచి 3వరకు జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి 9మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వీరిని సోమవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వీడ్కోలు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ డివి విద్యాసాగర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి హాజరయ్యారు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి కొమర భాస్కరరావు మాట్లాడుతూ జాతీయ పోటీల్లో జిల్లా నుంచి 9 మంది బాలబాలికలు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తైక్వాండోలో జిల్లా క్రీడాకారులు సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఇటీవలి తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు ఉత్తరాఖండ్లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైనట్టు వెల్లడించారు. కార్యక్రమంలో గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, ఎన్.ఈశ్వరరావు, రెడ్డి శివకుమార్, సనపల నరసింహులు, కురుటి తారకరామ, సకుముల శివాజీ, కొమర మోహన్ కృష్ణ, పాల్గొన్నారు.జాతీయ పోటీలకు రిఫరీగా మోహన్ కృష్ణడెహ్రాడూన్లో జరిగే జాతీయ సబ్ జూనియర్స్, క్యాడేట్స్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలకు రిఫరీగా జిల్లాకు చెందిన కొమర మోహన్ కృష్ణ నియమితులయ్యారు. తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రభాత్ కుమార్ శర్మ నుంచి నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ క్వాలిఫైడ్ అంపైర్ గతంలో పలు రాష్ట్రస్థాయి పోటీల్లో రిఫరీగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు.