విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 60 ను తక్షణమే అమలు చేయాలని, పేదలు నివాసం ఉన్న చోటే 100 గజాలు స్థలం ఉచితంగా రెగ్యులర్ చెయ్యాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఎల్ బి జి నగర్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఎల్ బి జి నగర్, రామకష్ణా నగర్, గురజాడ నగర్, వినాయకా నగర్, బుంగ వీధీ, బొగ్గులదిబ్బ, గంజిపెట, జొన్న గుడ్డి, నల్ల చెరువు,తది తర చోట్లపేదలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నా, వారికి నివాసం ఉన్నచోటే పట్టాలివ్వ కుండా ఊరవతలకు ప్రభుత్వాలు తరిమేస్తున్నాయని అన్నారు. జీఓ 60ను ఉపయోగించుకుని ఆక్రమణ దారులు రెగ్యులర్ చేసు కుంటున్నారని తెలిపారు. పేదలు నివాసం ఉన్న చోటే ఇళ్లు నిర్మించాలని భవిష్యత్ పోరాటాలు చేస్తామన్నారు. సిపిఎం నాయకులు పి.రమణమ్మ అధ్యక్ష తన జరిగిన సమావేవంలో బి. రమణ, పుణ్యవతి పాల్గొన్నారు.