అందరినీ సమన్వయం చేసుకుంటా

ప్రజాశక్తి – నెల్లిమర్ల: నియోజకవర్గంలో అందరినీ సమన్వ యం చేసుకుని పనిచేస్తానని నియోజకవర్గ టిడిపి పోల్‌ మేనేజ్మెంట్‌ కోఆర్డినేటర్‌ సువ్వాడ రవి శేఖర్‌ అన్నారు. ప్రస్తుత ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న సువ్వాడకు పోల్‌ మేనేజ్‌ మెంట్‌ సమన్వయకర్తగా అధిష్టానం మరో బాధ్య తను అప్పగించడంతో పద్మావతి నగర్‌లో రవిశేఖర్‌ ఇంటి వద్ద నగర పంచాయతీ టిడిపి కౌన్సిలర్లు అవనాపు సత్యనారాయణ, కింతాడ కళావతి, వార్డు టిడిపి ప్రతినిధులు కాళ్ళ సత్యవతి, శ్రీను, మజ్జి ఆదినారాయణ, సత్యనారాయణ, లక్ష్మణరావు, పొడుగు కృష్ణవేణి అతన్ని సత్కరించారు. రవిశేఖర్‌ మాట్లాడుతూ పార్టీ అప్పచెప్పిన బాధ్యతలును శక్తి వంచన లేకుండా నెరవేరుస్తానన్నారు. పోల్‌ మేనేజ్మెంట్‌ అనేది పార్టీకి ఎంతో కీలకమైనదని అటువంటి బాధ్యతలు తనపై నమ్మకంతో అప్పగిం చడం తనకు మరింత బాధ్యత పెరిగిందని నియోజ కవర్గంలో అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాను అని చెప్పారు.

➡️