గుజరాత్‌లో పిడుగులు పడి 24 మంది మృతి

Nov 28,2023 09:45 #Gujarat, #heavy rains

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో పిడుగులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. గడచిని 24 గంటల్లో పిడుగుపాటుకు గురై 24 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. పిడుగుపాటుతో మరణించిన వారిలో దాహోద్‌ జిల్లాలో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో దక్షిణ గుజరాత్‌ ప్రాంతంలోని పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. గుజారత్‌లోని 251 తాలూకాలకు గాను 230 తాలూకాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. రాష్ట్ర అత్యయిక పరిస్థితుల నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం పిడుగుపాటుకు 70కి పైగా మూగజీవాలు చనిపోయాయి. పిడుగుపాటుకు దాహౌద్‌ జిల్లాలో అత్యధికంగా నల్గురు చనిపోయారు. బనస్కాంత, భరూచ్‌లలో ముగ్గురేసి చొప్పున, తాపీ జిల్లాలో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలోనూ పిడుగులు పడి అయిదుగురు చనిపోయారు. అండమాన్‌ సమీపంలో అల్పపీడనంతుపానుగా మారే అవకాశంన్యూఢిల్లీ : అండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది క్రమేపీ బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదిలి బుధవారం నాటికి బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

➡️