రాష్ట్రంలో దోపిడీ పాలన : కందికుంట

Nov 26,2023 21:40

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట

        కదిరి అర్బన్‌ : రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకాలలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ పథకం ప్రజాప్రతినిధులకు ఎటిఎంలా మారిందని ఆరోపించారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ ఇంతవరకు అందలేదన్నారు. విద్యార్థులు నిరుద్యోగులు యువత ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారని వీరికి బైజుస్‌ ట్యాబుల పంపిణీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఒక్కొక్క విద్యార్థి పైన ఆరువేల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని కూడా తామే అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేదన్నారు. నియోజకవర్గంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

➡️