నేడు ఎచ్చెర్లలో సామాజిక సాధికార యాత్ర

వైసిపి ఆధ్వర్యాన చేపడుతున్న సామాజిక సాధికార యాత్రను ఈనెల 27వ తేదీన ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌

ప్రజాశక్తి – ఎచ్చెర్ల, నరసన్నపేట

వైసిపి ఆధ్వర్యాన చేపడుతున్న సామాజిక సాధికార యాత్రను ఈనెల 27వ తేదీన ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రణస్థలం మండలం పైడిభీమవరంలోని మహి గ్రాండ్‌లో పలువురు మంత్రులు విలేకరుల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అక్కడ్నుంచి ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కూడలికి చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఈ సభలో పలువురు మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు.

➡️