బిసిల అభ్యున్నతికి అందరూ సహకరించాలి

బిసిల అభ్యున్నతికి అందరూ సహకరించాలి బిసి కుల గణన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-మదనపల్లె రాష్ట్రంలో బిసి కుల జన గణనను పారదర్శకంగా చేపట్టి, రాజ్యాంగబద్ధంగా బిసిల అభ్యున్నతికి పార్టీలకు అతీతంగా అందరు న్యాకులు సహకరించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పునరుద్ఘాటించారు. ఆదివారం పట్టణం లోని బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె షటిల్‌ కోర్టులో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బిసి కుల గణన అంశంపై రాజ్యాంగబద్ధ హక్కుకై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వచ్చేసి పలు రాజకీయ పార్టీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తరతరాలుగా బతుకు తెరువు కోసం కులవత్తులపైనే ఆధారప డటం బిసిలు శాపగ్రస్తులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డలమైన బిసి సజనా త్మకమైన తెలివితేటలను వెలుగులోకి తెచ్చి దేశ సమగ్రత, జాతీయ, సమాజాభివద్ధికి కృషి చేయాల న్నారు. సమాజంలో అందరితో సమానంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాలలో ముందుకు నడిపించే నైతిక బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై ఉందని వారు తెలిపారు. ఈ విషయాలన్నిటిని సమగ్రంగా చర్చించి ప్రభుత్వాల దష్టికి తీసుకుని వెళ్లాలని నిర్ణ యించారు. జనసేన రాయలసీమ కో కన్వీనర్‌ రాందాస్‌ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్‌ జనరల్‌ సెక్రెటరీ దొరస్వామి నాయుడు , తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్‌ , కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్‌ , సోషల్‌ మీడియా మహమ్మద్‌ రఫీ, సేవాదళ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మహమ్మద్‌ అలీ,- భారతీయ అంబేద్కర్‌ సేన లక్ష్మీనా రాయణ సార్‌ , రెడ్డప్ప, బిసివై పార్టీ రమేష్‌ యాదవ్‌ , ఈడిగ సంఘం అధ్యక్షులు కె. కష్ణప్ప , భీమ్‌ సేఫ్‌ అధ్యక్షులు చిట్టిబాబు సార్‌ , వాల్మీకి సంఘం ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, మదనపల్లి టౌన్‌ అధ్యక్షుడు వలసల మంజునాథ్‌, అరవనిర్మాలమ్మ , నాయని జగదీష్‌, అడప సురేంద్ర ,కే రెడ్డమ్మ, గజ్జల రెడ్డప్ప, దేవా , మునగ మానురెడ్డి, శేఖర్‌ పాల్గొన్నారు

➡️